![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -621 లో.... కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని రుద్రాణికి చెప్తాడు రాహుల్. దాంతో దాన్ని నిరూపించే సాక్ష్యం తీసుకొని రమ్మని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్నని రెడీ చేస్తున్న దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. అదేంటి కావ్య మెడలో నగలు లేవు.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని అంటుంది.
అసలు ఉన్నాయా నగలు అని రుద్రాణి అనగానే.. ఉన్నాయని కావ్య అంటుంది. నా కోడలిని ఇలా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చాదని అపర్ణ తన మెడలో ఉన్న బంగారం కావ్య మెడలో వేస్తుంది. దాంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత స్వప్నకి శ్రీమంతం జరుగుతుంది. అందరు స్వప్నని ఆశీర్వదిస్తారు. కాసేపటికి అందరు భోజనం చేస్తుంటారు. మళ్ళీ రుద్రాణి వచ్చి నాన్న హాస్పిటల్ బిల్ కావ్య ఎలా కట్టిందో తెలుసా వదిన.. ఇంటి కోడలుకి ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి డబ్బు కట్టుందని అనగానే అందరు షాక్ అవుతారు.
కావ్య అలా ఎప్పటికి చెయ్యదని ఇంట్లో వాళ్లు అనడంతో ఇదిగో రిసీప్ట్ అని ఫోన్ లో అందరికి చూపిస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ప్రతీసారీ ఎందుకు అత్త ఎదో గొడవ చేయ్యాలని ట్రై చేస్తారని రుద్రాణిపై రాజ్ విరుచుకుపడతాడు. తరువాయి భాగంలో ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని అపర్ణ అడుగుతుంది. కావ్య చెప్పకపోవడంతో ఇకనుండి నువ్వు నాతో మాట్లాడకని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |